తిరుపతి: ఎస్వీయూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సికె జయశంకర్‌కు ఫ్రాన్స్ ఆహ్వానం పలికింది. ఫ్రాన్స్‌లోని లిల్లీ యూనివర్సిటీలో జూన్ 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొం టారు. ఈ సదస్సులో ఆయన ‘లాంథనైడ్ మాలిన్యం చేసి న గ్లాసెస్, గ్లాస్ సిరామిక్స్ మరియు నానో మెటీరియల్స్’ అనే అంశంపై పరిశోధన చేయనున్నారు. ఆయన ఇప్పటికే పలు జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రతిభను కనబరిచారు. తాజాగా ఫ్రాన్స్ కు వెళ్లనుండడంపై సహోద్యోగులు, కుటుంబీకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు.